Homeక్రైమ్రెండు తీర్థయాత్ర బస్సులు ఢీ.. నలుగురు మృతి

రెండు తీర్థయాత్ర బస్సులు ఢీ.. నలుగురు మృతి

క్రైమ్ మిర్రర్ : తీర్థయాత్రికులతో వెళ్తున్న రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది గాయపడ్డారు. వీరిలో 18 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘోర ప్రమాదం పంజాబ్‌లోని తరణ్ తరణ్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వృద్ధులకు ఉచితంగా పుణ్యక్షేత్రాల సందర్శన కల్పించేందుకు పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి తీర్థ యాత్ర’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా లాహిరిదాస్, బఘియారి గ్రామాలకు చెందిన యాత్రికులతో కూడిన ఓ బస్సు తీర్థయాత్ర ముగించుకుని ఫరీద్‌కోట్ జిల్లాకు తిరుగు ప్రయాణమైంది.

ఈ క్రమంలో శనివారం తరణ్ తరణ్ జిల్లాలోని నౌషెహ్రా పన్నూవాన్ సమీపంలో ఓ మహిళ బాలుడితో కలిసి స్కూటీపై హైవే దాటేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో అటుగా వస్తున్న యాత్రికుల బస్సు స్కూటీని ఢీకొట్టకుండా ఉండేందుకు డ్రైవర్ ఒక్కసారిగా బస్సును పక్కకు మళ్లించాడు. దీంతో బస్సు అదుపుతప్పి పక్క లేన్‌లోకి దూసుకెళ్లింది. ఎదురుగా అమృత్‌సర్ వైపు వెళ్తున్న మరో తీర్థయాత్ర బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు బస్సులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

నలుగురి దుర్మరణం.. 30 మందికి గాయాలు

ఈ ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న మహిళ, ఓ బస్సు డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది యాత్రికులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో స్కూటీపై ఉన్న బాలుడితో సహా 18 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురు రాజకీయ నాయకులు కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.

సీఎం భగవంత్ మాన్ దిగ్భ్రాంతి

ఈ ఘోర ప్రమాదంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నలుగురు ప్రాణాలు కోల్పోవడం తనను ఎంతగానో కలచివేసిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. పోలీసులు, ప్రభుత్వ అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
also read : డీజే శబ్దానికి 20 రోజుల పసికందు బలి?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు