ముంబై, క్రైమ్‌మిర్రర్: మహారాష్ర్టలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేటు బస్సు అతివేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి వంతెనను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఓ మహిళా ప్రయాణీకురాలు అక్కడికక్కడే మృతి చెందింది. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అప్రమత్తమైన స్థానికులు, ఇతర వాహనదారులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాజీరంగా నేషనల్ పార్క్ సమీపంలో అతి వేగంగా వెళ్తున్న మినీ బస్సు ఎదురుగా వస్తున్న కంటైనర్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అతివేగం కారణంగానే ఈ ఘోరం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
అలాగే, శుక్రవారం అర్ధరాత్రి కేరళంలోని త్రిసూర్ జిల్లాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఎనిమిది మంది మృతిచెందారు. వారంతా తమిళనాడుకు చెందిన విద్యార్థులుగా పోలీసులు భావిస్తున్నారు. బాధితులు గురువాయూర్ నుంచి కొడుంగల్లూరుకు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఇవి కూడ చదవండి:
-
ఇటలీలో మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి వేడుకలు.. వైరల్ అవుతున్న ప్రీ వెడ్డింగ్ ఫొటోలు!
-
హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం జగన్.. క్రిమినల్ కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్
-
డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు ‘ఇడుపు కాయితం’.. ప్రియదర్శి కొత్త సినిమా రిలీజ్ డేట్ ఖరారు!
-
రియల్ ఎస్టేట్‌లో నష్టాలు.. ఆర్థిక ఇబ్బందులతో వ్యాపారి ఆత్మహత్య
