క్రైమ్ మిర్రర్ : పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే ప్రాంతానికి చెందిన యువతీయువకులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే… అశోక్‌నగర్ పరిధిలోని స్థానిక ఉన్నత పాఠశాలలో జీత్ బిశ్వాస్, పూజా మోండల్ (ఇద్దరి వయసు 18 ఏళ్లు) 12వ తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ ఒకే ట్యూషన్‌కు వెళ్తుండేవారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అయితే, జీత్ ఇంట్లో వీరి వివాహానికి అంగీకరించబోరనే భయం ఉన్నట్లు తోటి విద్యార్థులు తెలిపారు.
ఘటన జరిగిన రోజు రాత్రి జీత్ తన ప్రేయసి పూజాకు వాట్సాప్ వీడియో కాల్ చేశాడు. మాట్లాడుతుండగానే సడన్‌గా అతను తన గదిలో సీలింగ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీడియో కాల్‌లో జీత్ బలవన్మరణానికి పాల్పడటాన్ని లైవ్‌లో చూసిన పూజా తీవ్ర షాక్‌కు గురైంది. ఆ మానసిక ఆందోళనను తట్టుకోలేక, ఆమె కూడా తన ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.
కొంతసేపటి తర్వాత పూజా గది నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూశారు. అప్పటికి ఆమె ఉరివేసుకుని కనిపించగా, ఆమె ఫోన్‌లో వాట్సాప్ వీడియో కాల్ ఇంకా ఆన్‌లోనే ఉంది. స్క్రీన్‌పై మరో యువకుడు ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
also read : యూపీలో కొత్త కూటమి…! చేతులు కలిపిన ఓవైసీ, ఆజాద్…
