Homeసినిమాఇటలీలో మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి వేడుకలు.. వైరల్ అవుతున్న ప్రీ వెడ్డింగ్ ఫొటోలు!

ఇటలీలో మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి వేడుకలు.. వైరల్ అవుతున్న ప్రీ వెడ్డింగ్ ఫొటోలు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. ఆయన మేనల్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు సిద్ధార్థ్ గల్లా త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. దక్షిణ కొరియాకు చెందిన హైయిన్ కిమ్‌తో ఆయన వివాహం జరగనుంది. ఇప్పటికే ఈ జంట నిశ్చితార్థ వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది.

జూలై 13న జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకకు సంబంధించిన విషయాలను మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా సిద్ధార్థ్ గల్లా, హైయిన్ కిమ్ వివాహ వేడుకలు ఇటలీలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో పెళ్లికి ముందు నిర్వహిస్తున్న వేడుకలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాబోయే వధూవరుల జంట ఫొటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మహేష్ బాబు కుటుంబంలో జరగనున్న ఈ వేడుక కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే, మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈ భారీ ప్రాజెక్టుపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

also read: డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు ‘ఇడుపు కాయితం’.. ప్రియదర్శి కొత్త సినిమా రిలీజ్ డేట్ ఖరారు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు