Homeక్రైమ్తల్లిపై కత్తితో దాడి.. ఆపై భవనంపై నుంచి దూకి బాలుడి ఆత్మహత్య

తల్లిపై కత్తితో దాడి.. ఆపై భవనంపై నుంచి దూకి బాలుడి ఆత్మహత్య

క్రైమ్ మిర్రర్ : అస్సాం రాజధాని గువాహటిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలుడు తన తల్లిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయి, ఓ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు.

వివరాల్లోకి వెళ్తే.. గువాహటిలోని తూర్పు జ్యోతినగర్ పరిధిలో ఉన్న హల్ధీ మిల్ ప్రాంతానికి చెందిన బాలుడు శుక్రవారం తన తల్లి చంద్రాని కలితపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. అనంతరం బాలుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి, నగరంలోని ఏబీసీ ప్రాంతంలో ఉన్న ఓ భవనం వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

మరోవైపు, బాలుడి దాడిలో తీవ్రంగా గాయపడిన చంద్రాని కలితను స్థానికులు గువాహటి మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడు తల్లిపై దాడి చేయడానికి గల కారణాలు ఏమిటి? అనంతరం ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డాడు? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
also read : ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూత.. తెలుగు సినీ పరిశ్రమలో విషాదం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు