Homeక్రైమ్జైలులో యువ ఖైదీపై లైంగిక వేధింపులు

జైలులో యువ ఖైదీపై లైంగిక వేధింపులు

క్రైమ్ మిర్రర్ : జైలు గోడల మధ్య ఖైదీలకు రక్షణ కల్పించాల్సిన వారే నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఓ కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్న 20 ఏళ్ల యువకుడిని తోటి ఖైదీలు లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పండుగల సందర్భంగా మత్తుమందు ఇచ్చి చీర కట్టించి, పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలోని హోత్వార్ జైలులో జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

పండుగల పేరుతో వేధింపులు..

వివరాల్లోకి వెళ్తే.. ఓ కేసులో అరెస్టైన 20 ఏళ్ల యువకుడు రాంచీలోని హోత్వార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ సమయంలో తోటి ఖైదీలు అతడిని లక్ష్యంగా చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మహాశివరాత్రి, శ్రీరామనవమి, సర్హుల్ పండుగల సందర్భంగా మత్తుమందు ఇచ్చి చీర కట్టించారని, ఆ తర్వాత తనపై పలుమార్లు లైంగిక దాడి చేశారని బాధితుడు వెల్లడించినట్లు సమాచారం.

ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపణలు

తోటి ఖైదీల దాడిలో గాయపడి రక్తస్రావం జరిగినప్పటికీ తనకు వైద్య చికిత్స అందించలేదని యువకుడు ఆరోపించాడు. జైలు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని, తన ఫిర్యాదు లేఖను చించివేశారని తెలిపాడు. చికిత్స అందించడంలోనూ నిర్లక్ష్యం వహించారని ఆరోపించాడు.

విడుదల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటన

ఈ ఏడాది జూన్ 12న రాంచీ కోర్టు యువకుడిని నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం తనకు ఎదురైన వేధింపుల గురించి కుటుంబ సభ్యులకు వివరించాడు. దీంతో బాధితుడి తండ్రి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

19 మందిపై కేసు నమోదు

బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు పలువురు ఖైదీలతో పాటు జైలు సూపరింటెండెంట్, జైలు ఆసుపత్రి వైద్యాధికారి, వార్డు ఇన్‌చార్జ్ సహా మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు. బాధితుడి ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు. జైలులో జరిగినట్లు చెబుతున్న ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
also read : రెండు తీర్థయాత్ర బస్సులు ఢీ.. నలుగురు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు