Homeతెలంగాణసజ్జనార్ బదిలీ వెనుక జరిగింది అదే...!

సజ్జనార్ బదిలీ వెనుక జరిగింది అదే…!

  • మెటా ఇండియా బాస్ పై కేసు

  • ప్రధాని ఫోటో మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం

  • బిజెపి నేతల ఫిర్యాదుతో చర్యలకు ఉపక్రమణ

  • కాంగ్రెస్ హై కమాండ్ ఆగ్రహంతో మూల్యం చెల్లించుకున్న పోలీస్ కమిషనర్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పోలీస్ అధికారుల బదిలీ ఇప్పుడు చర్చనీయాంసంగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ను ఆ కీలక బాధ్యతల నుంచి తప్పించి.. అప్రాధాన్య పోస్టుగా భావించే ఫైర్ సర్వీసెస్ బిజీగా బదిలీ చేయడం వెనుక ఏం జరిగిందనే దానిపై అనేక చర్చలు తెరవెనుక జరుగుతున్నాయి. సజ్జనార్ బదిలీకి కారణమైన వాటిలో కీలకమైన అంశంపై జూలైనాటి మెటా కేసు వివాదం ఉందని భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన మార్ఫింగ్ వీడియో లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లలో చక్కర్లు కొడుతున్నాయి అంటూ తెలంగాణ బిజెపి నాయకులు ఇచ్చిన ఫిర్యాదు పై జూలై 31న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏకంగా మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాసులపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. బిజెపి కార్యకర్తల ఫిర్యాదుతో గ్లోబల్ టెక్ దిగ్గజం పై కేసు నమోదు చేయడం.. కాంగ్రెస్ అధిష్టానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా కీలకమైన డిజిటల్ ప్లాట్ ఫామ్ లతో సంబంధాలు కొనసాగిస్తున్న తరుణంలో.. రాష్ట్ర పోలీసుల అత్యుత్సాహం జాతీయ స్థాయిలో ఇబ్బందికర పరిస్థితులకు దారితీసిందని ఏఐసీసీ పెద్దలు.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మందలించినట్లు ప్రచారం జరిగింది.

అప్పట్లో డిసిపి పై వేటు…

కేవలం ఈ పరిణామంతో అప్రమత్తమైన ప్రభుత్వం, ఎఫ్ఐఆర్ నమోదైన మరుసటిరోజే అప్పటి సైబర్ క్రైమ్ డిసిపి పై బదిలీ వేటు వేసి నష్ట నివారణ చర్యలకు దిగింది. అయితే ఆ వివాదం అంతటితో ఆగలేదని.. నగర పోలీస్ కమిషనర్ పీఠాన్ని కూడా కదిలించిందని తాజాగా ప్రచారం మొదలైంది. హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ ను తప్పించి.. ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ ను కొత్త కమిషనర్ గా నియమించింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలు లేదా ముందస్తు సమాచారం లేకుండానే అంతర్జాతీయ సమస్త అధిపతి పై కేసు నమోదు కావడం.. దానిని పర్యవేక్షించడంలో వైఫల్యం చెందారనే అసంతృప్తితోనే సజ్జనార్కు ఈ బదిలీ వేటు పడిందని విశ్లేషణలు వస్తున్నాయి.

అంచనా వేయలేక…

రాజకీయ సున్నితత్వం, జాతీయస్థాయి పరిణామాలను అంచనా వేయడంలో జరిగిన పొరపాటు.. చివరకు నగర పోలీస్ కమిషనర్ మార్పు వరకు వెళ్లింది. ఇప్పుడు తెలంగాణ రాజకీయ, పోలీస్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. రాష్ట్ర ప్రభుత్వ పరంగా పోలీస్ అధికారులు పనిచేయాలి. రాష్ట్ర హోం శాఖ పరిధిలోనే వీరి పని చేయాల్సి ఉంటుంది. కానీ జాతీయస్థాయిలో అధికారంలో ఉన్నారన్న కోణంలో బిజెపి నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో.. అది కూడా ప్రధాని మోదీ ఫోటో మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేశారన్న కోణంలో ఏకంగా మెటా అధినేత పైనే కేసు నమోదు చేయడం పోలీస్ అధికారులకు ఇబ్బందికరంగా మారింది. తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులకు ఇది ఒక గుణపాఠమే.

ఇవి కూడ చ‌ద‌వండి:

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు