Homeతెలంగాణఇవేం రాజకీయాలు రాహుల్...!

ఇవేం రాజకీయాలు రాహుల్…!

  • మోడీపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

  • ఆధారాలు ఉన్నాయంటూ ప్రకటన

  • బహిరంగ చర్చకు రావాలని సవాల్

  • పార్లమెంటులో చర్చిద్దాం అంటున్న బిజెపి

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: రాహుల్ గాంధీ జాతీయస్థాయిలో ఒక అగ్ర నేత. భావి ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ సైతం ప్రచారం చేసుకుంటోంది. మోడీకి ప్రత్యామ్నాయ నాయకత్వం రాహుల్ గాంధీ అన్న ప్రచారం కూడా ఉంది. ఇటువంటి తరుణంలో రాహుల్ రాజకీయం ఆ స్థాయిలోనే ఉండాలి. కానీ ఇటీవల రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు, విమర్శలు తేలిపోతున్నాయి. తాజాగా ప్రధాని మోదీపై ఫోన్ టాపింగ్ ఆరోపణలు చేశారు. బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. తన వద్ద ప్రధాని మోడీకి వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నాయని.. ఆ వివరాలు తన మొబైల్ ఫోన్ లో నే భద్రంగా ఉన్నాయని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రధాని మోదీ తన ఫోన్ ను ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని తనతో ముఖాముఖి బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ చేశారు. మోదీ కోరుకున్న వేదిక వద్ద, ఆయన సూచించిన న్యాయ నిర్ణేతల సమక్షంలోనే చర్చకు సిద్ధమని తేల్చి చెప్పారు.

సొంత పార్టీ నుంచి అభ్యంతరాలు…

అయితే రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరుపై భారతీయ జనతా పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్ నేతల నుంచి వ్యతిరేక స్పందన వస్తోంది. మోడీపై బలమైన ఆధారాలు ఉంటే ఫోన్లో పెట్టుకోవడం ఏమిటో.. ప్రజల ముందు పెట్టాలి కదా అన్న ప్రశ్న వస్తోంది. తనతో సిబిఐ, ఈడీ, జడ్జిలు కూడా టచ్ లో ఉన్నారంటూ రాహుల్ చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఇప్పుడు ఆయన ఫోన్ లో ఆధారాలపై అనేక రకాల సెటైర్లు పడుతున్నాయి. ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక రాజకీయాలు చేయకుండా.. నిరాధారమైన ఆరోపణలు, ఫోన్ టాపింగ్ వంటి అంశాలతో రాహుల్ అనవసర రాద్దాంతం చేస్తున్నారని బిజెపి ఆరోపిస్తోంది. రాహుల్ ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని… ఆయన రోజు అబద్దాలతోనే రాజకీయం చేస్తున్నారని బిజెపి మండిపడుతోంది.

పార్లమెంటు బయట…

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత వేదికగా ఉంది పార్లమెంట్. అక్కడ కాదని రాహుల్ బయట సవాళ్లు విసరడాన్ని అధికారపక్షం తప్పుపడుతోంది. లోక్ సభలో ప్రతిపక్ష నేతగా, బాధ్యతయుతంగా వ్యవహరించాల్సిన రాహుల్.. పార్లమెంట్ లో చర్చకు రావాలని తాము పదేపదే సవాల్ విసురుతున్న తప్పించుకు తిరుగుతున్నారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం రాహుల్ సవాల్ స్పందించారు. బహిరంగ వేదికల కంటే పార్లమెంటులోనే చర్చకు రావాలని.. అవసరం అనుకుంటే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అయితే రాహుల్ గాంధీ తన వైఖరిని సమర్థించుకుంటున్నారు. ఆయన తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇవి కూడ చ‌ద‌వండి:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు