వికారాబాద్, క్రైమ్మిర్రర్: కారు ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదం వికారాబాద్ జిల్లా బోంరాస్పేట్ మండలం నాందార్పూర్ గ్రామ శివారులోని తుంకిమెట్ల నుంచి కోస్గీ వెళ్లే రోడ్డులో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ఆటోలో ప్రయాణీస్తున్న మరో న లుగురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఒకరికి రెండు రోజుల్లో వివాహం జరుగాల్సి ఉండగా ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఘోర రోడ్డు ప్రమాదం…! ఇద్దరు స్పాట్లోనే….
0
12
Previous article
Next article
