Hometelanganaపేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత YSR- బండి రమేష్

పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత YSR- బండి రమేష్

పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయిన మహానేత డాక్టర్ వైఎన్ రాజశేఖర్ రెడ్డి అని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కమ్మ కార్పొరేషన్ చైర్మెన్, కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ శ్రీ బండి రమేష్ గారు అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. కూకట్ పల్లి నియోజకవర్గం గాయత్రినగర్ డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దేవరింటి మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వైఎస్సాఆర్ 77వ జయంతి వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు బండి రమేష్ గారు. పర్వత్ నగర్ లోని ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర సీనియర్ కార్యకర్త రంగారావు ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహానికి ఆయన పులమాల వేసి నివాళి అర్పించారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం రోగులు, ప్రజలకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీ బ్లాక్ ప్రెసిడెంట్ తూము వేణు, సీనియర్ నాయకులు నర్సింహ యాదవ్, వేముల సత్యం, డివిజన్ యూత్ ప్రెసిడెంట్ రావుల మహేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజారెడ్డి, ఆదినారాయణ,చెల్లయ్య, జూనియర్ రావు, సతీష్ రెడ్డి,సత్య నారాయణ, పవన్ కుమార్, డివిజన్ యూత్ ప్రెసిడెంట్ మహేందర్, రాబర్ట్, సురేశ్, నాగిరెడ్డి, మహిళా కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు,మహిళా కార్యకర్తలు, డివిజన్ వాసులు, వైఎస్సార్ అభిమానులు భారీగా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు