నాగర్ కర్నూలు, క్రైమ్‌మిర్రర్: విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను ప్రయోజకులను చేయాల్సిన గురువే కామపిశాచిగా మారాడు. కన్నతండ్రి స్థానంలో ఉండి రక్షణ కల్పించాల్సిన ప్రిన్సిపాల్ కీచక పర్వానికి తెరలేపాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ అత్యంత దారుణ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో వెలుగుచూసింది. ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థిపై ఆ కాలేజీ ప్రిన్సిపాల్ వికృత చేష్టలకు ఒడిగట్టాడు. విచక్షణ మరచి లైంగిక దాడికి యత్నించిన ఆ కామాంధుడి బారి నుంచి తనను తాను కాపాడుకునేందుకు ఆ విద్యార్థి సాహసోపేతంగా పోరాడాడు. దేవుడిలాంటి గురువు ముసుగులో ఉన్న ఆ కీచకుడికి జీవితకాలం గుర్తుండిపోయేలా బుద్ధి చెప్పి తన శీలాన్ని, ప్రాణాలను కాపాడుకున్నాడు.
Also Read:నితిన్ నబిన్ పర్యటనతో తెలంగాణ బీజేపీ నేతల్లో జోష్…!
కొల్లాపూర్‌లో ఓ విద్యార్థిపై పీజీ కళాశాల ప్రిన్సిపల్ మార్క్ పోలోనియస్ లైంగికంగా, మానసికంగా దాడికి పాల్పడ్డాడు. భాదిత విద్యార్ది 2025లో PG పూర్తి చేసిన తనకు టీసీఇవ్వాలని ప్రిన్సిపల్‌ను కోరగా, ఇంటికి వస్తే ఇస్తానని చెప్పడంతో ప్రిన్సిపల్ ఇంటికి తన ఫ్రెండ్‌తో కలిసి వెళ్లాడు. రాత్రి 10 గంటలకు తన ఇంటికి విద్యార్థిని పిలిపించుకొని ప్రిన్సిపల్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిత్రహింసలకు గురి చేస్తుండడంతో ప్రిన్సిపల్ ప్రైవేట్ పార్టును విద్యార్థి కొరికాడు. దాంతో ప్రిన్సిపల్ నగ్నంగా పారిపోయాడు. బాధిత విద్యార్థి రాత్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. తక్షణమే ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల డిమాండ్.
Also Read:చరిత్ర చెరపలేని పేరు వైఎస్ఆర్: జయంతి సందర్భంగా వైసీపీ ఘన నివాళి