Homeఆంధ్ర ప్రదేశ్"రాజు మనస్తత్వం బాగుంటేనే వర్షాలు కురుస్తాయి" - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

“రాజు మనస్తత్వం బాగుంటేనే వర్షాలు కురుస్తాయి” – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు చంద్రబాబు నాయుడే కారణమంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.నంద్యాలలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “రాజు మనస్తత్వం బాగుంటేనే వర్షాలు వస్తాయి. ప్రస్తుతం రాజు తీరు సరిగ్గా లేదు, అందుకే ప్రకృతి కూడా సహకరించడం లేదు,” అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రజలను మాయ మాటలతో, అబద్ధపు హామీలతో మోసం చేశారని ఆరోపించారు. “ఆశ పెట్టి మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట. ప్రజల ఆశ ముందు కృతజ్ఞత ఓడిపోయింది,” అని బుగ్గన వ్యాఖ్యానించారు.మరోవైపు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనను ఆయన ప్రశంసించారు. “జగన్ మోహన్ రెడ్డి గారు తాను చేసిన మంచి పనులను చూసి ఓట్లు అడిగారు తప్ప, అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టలేదు,” అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రకృతి కూడా మంచి పాలకులకు సహకరిస్తుందని, ప్రస్తుతం ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదని ఆయన ఎద్దేవా చేశారు.బుగ్గన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

భారత్ ఘోర ఓటమి.. కోచ్ గంభీర్‌ను తొలగించాలని ఫ్యాన్స్ డిమాండ్!

రైల్వేలో భారీ ఉద్యోగ అవకాశాలు: 4,098 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు