Homeఆంధ్ర ప్రదేశ్నల్లమల శాసనాల్లో అమరావతి చారిత్రక ఆనవాళ్లు: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

నల్లమల శాసనాల్లో అమరావతి చారిత్రక ఆనవాళ్లు: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

క్రైమ్ మిర్రర్,అమరావతి:- ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చారిత్రక ప్రాశస్త్యంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లమల ప్రాంతంలో బయటపడిన ప్రాచీన శాసనాల్లో అమరావతికి సంబంధించిన స్పష్టమైన ఆనవాళ్లు లభ్యమయ్యాయని ఆయన వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (X) లో ఆయన ఒక పోస్ట్ చేశారు.గత కొంతకాలంగా అమరావతిపై కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అసత్య ప్రచారాలకు ఈ ప్రాచీన శాసనాలే తగిన బదులిస్తాయని పవన్ స్పష్టం చేశారు. నేటి ఈ అమరావతిలోనే నాడు బౌద్ధం విశేషంగా విలసిల్లిందని, ప్రసిద్ధ అమరావతి స్తూపం ఉన్నట్లుగా ఈ శాసనాల ద్వారా బలమైన ఆధారాలు లభించాయని ఆయన తెలిపారు.”ఒకప్పుడు ప్రపంచానికే శాంతి సందేశాన్ని అందించిన గొప్ప బౌద్ధ క్షేత్రంగా అమరావతి వెలుగొందినట్లు ఈ ఆధారాలను బట్టి స్పష్టంగా తెలుస్తోంది” అని పవన్ కళ్యాణ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.అమరావతికి ఉన్న ఘనమైన చరిత్రను, బౌద్ధ మతంతో ఉన్న అనుబంధాన్ని తెలియజేసే ఈ అమూల్యమైన చారిత్రక సాక్ష్యాలను వెలుగులోకి తెచ్చిన శాస్త్రవేత్తలు, పురావస్తు పరిశోధకులను పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

MG University Water Crisis: మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నీటి సమస్య.. అర్ధరాత్రి వీసీ ఇంటి ముందు విద్యార్థినుల నిరసన!

England vs India 2nd T20: ఆర్చర్ దెబ్బకు కుప్పకూలిన భారత్..125 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు