-
వివాహేతర సంబంధం, చైనాకు ఏఐ చిప్ లు విక్రయించారనే ఆరోపణలతో వేటు
-
తాజాగా క్లీన్ చీట్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
క్రైమ్ మిర్రర్, ఇంటర్నేషనల్ డెస్క్: అగ్ర నేత అధిపతి డోనాల్డ్ ట్రంప్ భిన్నంగా స్పందిస్తుంటారు. భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ప్రపంచ టెక్ దిగ్గజం ఎన్విడియా మాజీ సీఈవో జేన్సన్ హువాంగ్ పదవీ విరమణ కు దారి తీసిన సంచలన వివాదంలో ట్రంప్ చాలా స్పష్టతతో ఉన్నారు. చైనాకు చెందిన అలీస్ హువాంగ్ అనే మహిళతో జెన్సన్ హువాంగ్ కు ఉన్న వివాహేతర సంబంధం, నిషేధిత ఏఐ చిప్ లను చైనాకు అక్రమంగా విక్రయించారని తీవ్ర ఆరోపణలతో ఇటీవల ఆయన ఎన్విడియా బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మూల కారణమైన అలిస్ హువాంగ్ అసలు చైనా గూడాచారి కాదని డోనాల్డ్ ట్రంప్ బహిరంగంగా ప్రకటించి.. జెన్సన్ హువాంగ్ కు బాసటగా నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అందమైన చైనా యువతులపై స్పై ముద్ర వేయడం సహజమేనని చెప్పుకు రావడం విశేషం.
ఆధారాలు లేవంటూ…
అలిస్ హువాంగ్ ను చైనా నిఘా సంస్థ ఏజెంట్గా చిత్రీకరించడం వెనుక సరైన ఆధారాలు లేవని అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా న్యాయశాఖ దర్యాప్తులోనూ ఆమె గూడచార్య కార్యకలాపాలకు పాల్పడినట్లు నిర్ధారించే బలమైన సాక్ష్యాలు లభించలేదని నివేదికలు పేర్కొంటున్నందున.. ట్రంప్ వ్యాఖ్యలు జెన్సన్ హువాంగ్ కు పెద్ద ఊరటగా చెప్పవచ్చు. అమెరికా ఏఐ రంగాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టిన జెన్సన్ వంటి మిషనరీ లీడర్ పై ఇలాంటి నిరాహార ఆరోపణలతో ఒత్తిడి తీసుకురావడం సరికాదని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
భిన్న స్పందన…
జాతీయ భద్రతా నిపుణులు, వాషింగ్టన్ లోని కొందరు చట్టసభ సభ్యులు మాత్రం ఈ అంశంపై భిన్నంగా స్పందిస్తున్నారు. సింగపూర్ కేంద్రంగా పనిచేసిన మెగా స్పీడ్ సంస్థ ద్వారా అమెరికా ఆంక్షలు విధించిన ఎన్విడియా చిప్ లు చైనాకు చేరాయనే ఆరోపణలు తేలికగా కొట్టి పారేయలేమని.. జాతీయ భద్రతా కోణంలో దర్యాప్తు పూర్తిస్థాయిలో జరగాలని వాదిస్తున్నారు. అలిస్ హువాంగ్ కు చైనా ప్రభుత్వ వర్గాలతో ఉన్న సంబంధాలపై విదేశాంగ శాఖ వ్యక్తం చేసిన అనుమానాలను పూర్తిగా తోసిపుచ్చలేమని పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వివాదంలో అత్యంత కీలకమైన చైనా స్పై ఆరోపణ స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తోసిపుచ్చడంతో.. జెన్సన్ హువాంగ్ చుట్టూ అల్లుకున్న ఉచ్చు సడలింది. దీనిపై సిలికాన్ వ్యాలీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రధాన ఆరోపణ వీగిపోతే.. కేవలం వ్యక్తిగత వివాదం కారణంగా ఆయనను ఎన్విడియాకు దూరంగా ఉంచడం సాధ్యం కాదని.. త్వరలోనే ఆయన మళ్ళీ కీలక బాధ్యతలతో రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.
