Homeతెలంగాణతెలంగాణను వణికిస్తున్న చలిగాలులు

తెలంగాణను వణికిస్తున్న చలిగాలులు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న రాత్రిపూట ఉష్ణోగ్రతలు తాజాగా రికార్డు స్థాయికి పడిపోయాయి. ఈ శీతాకాలం సీజన్‌లో తొలిసారిగా రాష్ట్రంలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు చలికి గజగజా వణికిపోతున్నారు. సాయంత్రం నుండే చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత అత్యధికంగా నమోదైంది. సంగారెడ్డి జిల్లా సత్వార్‌లో అత్యల్పంగా 9.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు కాగా, అదే జిల్లాలోని కోహిర్‌లో 9.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే ప్రథమం.ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ చలి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. కామారెడ్డి జిల్లా డోంగ్లిలో 10.5 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 10.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో 11 డిగ్రీలు, మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మరియు మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. నిజామాబాద్ జిల్లా వర్నిలో 12.3 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. చలి నుండి ఉపశమనం పొందడానికి ప్రజలు చలిమంటలు వేసుకుంటూ వెచ్చదనం పొందే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మరియు శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

మళ్లీ ఎన్విడియా సీఈవోగా జెన్సన్ హువాంగ్…!

‘మంగళగిరి- తాడేపల్లి’ కార్పొరేషన్ ఎవరిది…?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు