Homeక్రైమ్ప్రేమ వివాహానికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య

ప్రేమ వివాహానికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య

క్రైమ్ మిర్రర్ : ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించాడన్న మనస్తాపంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసుల వివరాల మేరకు… ఘట్కేసర్ పీఎస్ పరిధిలోని ఎన్ఎఫ్సీ నగర్‌కు చెందిన యువతి (22), ఉప్పల్ చిలుకానగర్‌కు చెందిన జామ కిరణ్ కుమార్ (28) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

ఈ విషయం యువతి తండ్రికి తెలియడంతో, ఆయన యువకుడి ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులతో పెళ్లి ప్రస్తావన తెచ్చారు. అయితే, వారు ఈ వివాహానికి అంగీకరించలేదు. ఆ తర్వాత యువకుడు కూడా పెళ్లికి నిరాకరించినట్లు సమాచారం. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన యువతి బుధవారం సాయంత్రం తన గదిలోకి వెళ్లి లోపల గడియ పెట్టుకుని, ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది.

చాలాసేపటి వరకు యువతి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపు తట్టారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో తలుపు బద్దలు కొట్టి చూడగా, ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను ఉప్పల్ డిపో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం ఉదయం ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
also read : వీడిన రెండున్నరేళ్ల చిన్నారి కిడ్నాప్ మిస్టరీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు