Homeతెలంగాణగచ్చిబౌలి పీజీ హాస్టల్‌లో గంజాయి కలకలం

గచ్చిబౌలి పీజీ హాస్టల్‌లో గంజాయి కలకలం

క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ పీజీ హాస్టల్‌లో గంజాయి వినియోగం కలకలం రేపింది. ఈగల్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఆరుగురు యువకులు గంజాయి వినియోగించినట్లు డ్రగ్ పరీక్షల్లో వెల్లడైంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

1908 హెల్ప్‌లైన్‌కు అందిన సమాచారం ఆధారంగా పోలీసులు గచ్చిబౌలిలోని ఓ పీజీ హాస్టల్‌పై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఎనిమిది మందికి డ్రగ్ పరీక్షలు చేయగా, ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు.

తనిఖీల్లో భాగంగా యువకుల వద్ద నుంచి సుమారు 15 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా హాస్టల్‌కు గంజాయి సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్న మరో ముగ్గురు వ్యక్తులను గుర్తించారు. వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేసి, సరఫరా వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

నగరంలోని పీజీ హాస్టళ్లు, యువత నివసించే ప్రాంతాల్లో మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలపై ఈగల్ ఫోర్స్ ప్రత్యేక నిఘా కొనసాగిస్తోంది. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిస్తే 1908 హెల్ప్‌లైన్‌కు తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు.
also read : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు