పల్నాడు, క్రైమ్‌మిర్రర్: పల్నాడు జిల్లాలోని గామాలపాడు వద్ద బుధవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం వ్యాన్‌ను కంటైనర్ ఢీకొంది. ఈ ప్రమాద ఘటనలో డీసీఎం వ్యాన్‌లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనలో ఏడు గొర్రెలు కూడా మృతిచెందాయి. మృతులను క్రోసూరు మండల వాసులుగా గుర్తించారు. గురజాల సంత నుంచి గొర్రెలను కొనుగోలు చేసుకోని హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పల్నాడు జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం…! ముగ్గరు స్పాట్‌లోనే …
0
2
Previous article
