Homeతెలంగాణకోమటిరెడ్డి అటాక్...! సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్య‌లు...

కోమటిరెడ్డి అటాక్…! సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్య‌లు…

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ తన నోటికి పని చెప్పారు. సొంత ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు దాటుతున్న ప్రజలు సంతోషంగా లేరని.. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన కాంట్రాక్టర్లు ఇప్పుడు చక్రం తిప్పుతున్నారని ఆరోపించారు. ఆంధ్ర కాంట్రాక్టర్లను దోపిడీ దొంగలుగా అభివర్ణిస్తూ ప్రభుత్వం పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని ఆయన చెప్పుకోచ్చారు. మనకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం లేదని.. పదవులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇచ్చి సహకరించాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.

నిధుల కేటాయింపు పై ఆగ్రహం…

రాష్ట్రంలో ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాలకే నిధులు కేటాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ఎలాంటి పక్షపాతం చూపకుండా సమానంగా నిధులు కేటాయించాలని.. మునుగోడుకు అన్యాయం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదు అని.. కురుక్షేత్రమేనని ఆయన హెచ్చరించారు. అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయ్యావ్ అంతే.. పండబెట్టి తొక్కుతా అనే భాషను పాలకులు మార్చుకోవాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి పై రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రాజీ పడనంటూ…

తాను రాహుల్ గాంధీ మనిషినే అయినప్పటికీ తనను గెలిపించిన మునుగోడు నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలు, అభివృద్ధి విషయంలో ఎవరితోనూ రాజీ పడే ప్రసక్తి లేదని రాజగోపాల్ రెడ్డి తేల్చి చెప్పారు. గత కొంతకాలంగా నియోజకవర్గ నిధుల విడుదల, పెండింగ్ బిల్లులు, వివిధ పదవుల నియామకాల విషయంలో అసంతృప్తితో ఉన్న ఆయన.. ఇక తగ్గేదే లేదన్నట్టుగా బహిరంగంగానే సవాళ్లు విసరడం గాంధీభవన్ నుంచి సచివాలయం వరకు కలకలం రేపుతోంది.. ముఖ్యంగా సొంత పార్టీ ఎమ్మెల్యే అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఎంతటి తీవ్ర పదజాలాలు వాడడం ఇక తగ్గేదే లేదన్న సంకేతాలు పంపడానికి తెలుస్తోంది.

తీవ్ర అసంతృప్తి…

గత కొంతకాలంగా మంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్న రాజగోపాల్ రెడ్డి సొంత ప్రభుత్వంపై కూడా విరుచుకుపడుతూ వచ్చారు. ఒకానొక దశలో ప్రభుత్వాన్ని పడగొడతా అని కూడా అన్నారు. కానీ ఎప్పుడూ ఆయనపై క్రమశిక్షణ చర్యలు దిశగా ఆలోచన చేయలేదు. దీంతో ఆయన మరింతగా రెచ్చిపోతున్నారు. గతంలో కొండా సురేఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆమె కుమార్తె అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేరుగా ముఖ్యమంత్రి పైనే విమర్శలు ఎక్కుపెట్టారు. దీనిని భాధ్యులను చేస్తూ మంత్రి పదవి నుంచి సురేఖను తప్పించారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో మాత్రం ఎందుకో ఉదాసీనత కనబరుస్తున్నారు. దీంతో ఆయన పరిస్థితి రోజురోజుకు శృతిమిస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ హై కమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇవి కూడ చ‌ద‌వండి:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు