Homeక్రైమ్లొంగిపోవాలని వీడియో కాల్‌లో కోరినా వినలేదు.. ఎన్‌కౌంటర్‌లో లతీఫ్ భట్ హతం

లొంగిపోవాలని వీడియో కాల్‌లో కోరినా వినలేదు.. ఎన్‌కౌంటర్‌లో లతీఫ్ భట్ హతం

క్రైమ్ మిర్రర్ : జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు చేపట్టిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లతీఫ్ భట్ హతమయ్యాడు. కుల్గాం జిల్లాలో ఈరోజు ఉదయం జరిగిన ఎదురుకాల్పుల అనంతరం ఎన్‌కౌంటర్ ప్రాంతంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. అయితే భద్రతా బలగాల ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆర్మీ అధికారులు వెల్లడించనున్నారు.

ఎన్‌కౌంటర్ సమయంలో లతీఫ్ భట్ తలదాచుకున్న మసీదుకు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కశ్మీర్‌లో క్రియాశీలకంగా ఉన్న స్థానిక ఉగ్రవాదుల్లో భట్ కీలకమైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. కుల్గాంలో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి తప్పించుకున్న అతడి కోసం భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి.

ఈ క్రమంలో జంగల్‌పురా గ్రామంలో అతడు ఉన్నట్లు గుర్తించిన సైనికులు, వీడియో కాల్ ద్వారా అతడిని లొంగిపోవాలని కోరారు. ఆయుధాలను విడిచిపెట్టి బయటకు రావాలని సూచించారు. అయితే భట్ లొంగిపోయేందుకు నిరాకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మసీదులో ఉదయం ప్రార్థనలు ముగిసిన అనంతరం ఎదురుకాల్పులు ప్రారంభమైనట్లు సమాచారం. కాగా, సోమవారం జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది ఉమర్ నిసార్ దార్ భద్రతా బలగాల కాల్పుల్లో హతమయ్యాడు. ఈ నెల 11న సీఆర్పీఎఫ్ పోస్టుపై జరిగిన దాడిలో దార్, లతీఫ్ భట్‌లకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌లో దార్ ఇటీవల చేరినట్లు సమాచారం. గత ఆరు నెలలుగా భట్‌కు దార్ ఆశ్రయం కల్పించినట్లు తెలుస్తోంది.
also read : హోటల్‌లో జంట పట్టుబాటు.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తానని పోలీసుల బెదిరింపు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు