Homeక్రైమ్ మాజీ మంత్రి జానారెడ్డి గన్‌మెన్ కన్నుమూత.. గుండెపోటుతో మృతి

 మాజీ మంత్రి జానారెడ్డి గన్‌మెన్ కన్నుమూత.. గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి జానారెడ్డి వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ శ్రీరాముల బిక్షపతి (45) గుండెపోటుతో మరణించారు. సోమవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు.

సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం కూటిగల్ గ్రామానికి చెందిన బిక్షపతి ప్రస్తుతం మాజీ మంత్రి జానారెడ్డి వద్ద భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. చికిత్స పొందుతూ బిక్షపతి మరణించారు. 45 ఏళ్ల వయసులోనే ఆయన మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు.

బిక్షపతికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న ఆయన ఆకస్మిక మరణంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

also read: పర్యాటకులకు గుడ్‌న్యూస్.. నవంబర్ 19న తాజ్‌మహల్ సహా మూడు చారిత్రక కట్టడాల్లో ఉచిత ప్రవేశం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు