Homeతెలంగాణఇండియా కూటమిలో లుకలుకలు...! సీట్ల పంపకాల విషయంలో విభేదాలు...

ఇండియా కూటమిలో లుకలుకలు…! సీట్ల పంపకాల విషయంలో విభేదాలు…

  • యూపీలో కాంగ్రెస్ తీరును తప్పు పడుతున్న అఖిలేష్ యాదవ్

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరికొద్ది నెలలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు ఇండియా కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షాలైన సమాజ్వాది, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 181 సీట్లు కావాలని డిమాండ్ చేస్తోంది. ఈ విషయాన్ని అఖిలేష్ యాదవ్ స్వయంగా ప్రకటించారు. ఢిల్లీలో ఓ మీడియా సమ్మిట్ వేదికపై అఖిలేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ వంద సీట్లు కంటే ఎక్కువే కోరుతోందని.. 200 కంటే కొంచెం తక్కువగా.. అంటే 180కి ఒకటి కలిపి అడిగిందని తనదైన శైలిలో వ్యంగ్యంగా.. అసంతృప్తి ధోరణితో వ్యాఖ్యానించారు.

సార్వత్రిక ఎన్నికల్లో మంచి ఫలితాలు…

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాది- కాంగ్రెస్ కూటమి మంచి ఫలితాలు సాధించింది.. 80 పార్లమెంట్ స్థానాలకు గాను 43 సీట్లు గెలుచుకొని భారతీయ జనతా పార్టీకి షాక్ ఇచ్చింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలని కాంగ్రెస్ భావిస్తోంది. నాడు 17 స్థానాల్లో పోటీ చేసి 6 చోట్ల గెలుచుకున్న ఉత్సాహంతో.. ఇప్పుడు ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు సగం అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్ కోరుతోంది. రాజకీయ వర్గాల్లో ఇదో సంచలనంగా మారుతుంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్.. కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది. సమాజ్ వాది పార్టీ 11 స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బలంగా నిలిచింది. ఈ గణాంకాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి కాంగ్రెస్ పార్టీకి కేవలం 60 నుంచి 70 సీట్లు మాత్రమే కేటాయించాలని అఖిలేష్ భావిస్తున్నారు.

బలం లేకపోయినా…

యూపీలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బలం లేదని.. అయినా సరే భారీ సంఖ్యలో సీట్లు డిమాండ్ చేయడాన్ని సమాజ్వాది పార్టీ వర్గాలు అతిగా పరిగణిస్తున్నాయి. ఇరు పార్టీల నేతలు ఒకరి కంచుకోటలో మరొకరు రాజకీయ యాత్రలు చేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ తో తమ సంబంధాలు బాగానే ఉన్నాయని.. కలిసికట్టుగానే బిజెపిని ఓడిస్తామని అఖిలేష్ పైకి చెబుతున్నారు. తాము ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో ఇప్పటికే నిర్ణయించుకున్నామని స్పష్టం చేయడం ద్వారా కాంగ్రెస్కు గట్టి సంకేతాలు పంపారు. కాకా ఈనెల 17న ఇరు పార్టీల మధ్య అధికారికంగా సీట్ల పంపకాలపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. గతంలో మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ అనుసరించిన కఠిన వైఖరి వల్ల కూటమికి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అందుకే యూపీలో అఖిలేష్ యాదవ్ మాత్రం కాంగ్రెస్ ఒత్తిడికి తలొగ్గే పరిస్థితి లేదని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడ చ‌ద‌వండి:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు