డెహ్రాడూన్, క్రైమ్‌మిర్రర్: ఉత్తరాఖండ్‌లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెహ్రీ గఢ్వాల్ జిల్లా గూలర్ బజార్ సమీపంలో ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది స్పాట్‌లోనే మృతి చెందగా 26 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. కాగా క్షతగాత్రుల అర్దనాదాలతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది.
సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర విపత్తు స్పందన దళం (SDRF), పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి, లోయలో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తీవ్రంగా గాయపడిన వారిని అంబులెన్సుల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అదనపు ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలనూ అక్కడికి రప్పించారు పోలీసులు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే తెహ్రీ జిల్లా కలెక్టర్ నితికా ఖండేల్వాల్, ఎస్పీ శ్వేతా చౌబే ఘటనా స్థలానికి బయలుదేరారు. మరోవైపు, బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇవి కూడ చదవండి:
- షుగర్, బీపీ అదుపులో ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
‘అక్వాన్’ తుఫాన్ ముప్పు: 21న తెలంగాణలో అతి భారీ వర్షాలు, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ తరహా హెచ్చరికలు!
-
రజత్ పాటీదార్ వీరవిహారం: 48 బంతుల్లోనే 135 రన్స్‌తో చారిత్రాత్మక సెంచరీ!
-
చలికాలంలో ముక్కు దిబ్బడకు చెక్: ఇంట్లోనే ఈ సింపుల్ చిట్కాలతో తక్షణ ఉపశమనం!
