Homeక్రైమ్హైద‌రాబాద్‌లో దారుణం...! బ‌ధిరి మ‌హిళ‌పై అత్యాచారం...

హైద‌రాబాద్‌లో దారుణం…! బ‌ధిరి మ‌హిళ‌పై అత్యాచారం…

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఎన్ని చ‌ట్టాలు వ‌చ్చిన మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతుంది. కుమారుడిని బ‌స్సు ఎక్కించి తిరిగివ‌స్తుండ‌డంతో కామాంధులు మాయ‌ట‌ల‌తో న‌మ్మించి ఆటోలో ఎక్కించుకొని మార్గ‌మ‌ధ్య‌లో శీత‌ల పానీయాలు మ‌త్తు క‌లిపి ఇవ్వ‌డంతో స్పృహా కోల్పోవ‌డంతో అత్యాచారానికి పాల్ప‌డ్డ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం హ‌య‌త్‌న‌గ‌ర్‌లో కుటుంబంలో బాధితురాలు నివాసం ఉంటున్నారు.ఈ క్ర‌మంలో కుమారుడిని బ‌స్సు ఎక్కించి తిరిగి వ‌స్తుండ‌గా మ‌హిళ‌పై నిందితుడు క‌న్నేశాడు.

ఆమె తల్లిదండ్రులకు అనారోగ్యమంటూ సయ్యద్ జావీద్ అనే పరిచయస్తుడు నమ్మించాడు. తల్లిదండ్రులను చూపిస్తానంటూ ఆటోలో తీసుకెళ్లి మార్గమధ్యలో అతడు శీతలపానీయం ఇచ్చాడు. ఈ ఘటన అనంతరం బాధితురాలు స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆమెకు మెలకువ వచ్చేసరికి గదిలో అభ్యంతరకరంగా.. చేతులు చున్నీతో కట్టేసిన స్థితిలో ఉంది. గదిలో మరో నిందితుడు వెంకటేశ్ కూడా ఉండటంతో ఇద్దరూ కలిసి మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. నిందితులు వెళ్లిపోయిన తర్వాత బయటకు వచ్చి తల్లి వద్దకు బాధితురాలు చేరారు. తనకు జరిగిన దారుణంపై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.

ఇవి కూడ చ‌ద‌వండి:

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు