Homeక్రీడలుMI కెప్టెన్ రేస్.. నా మద్దతు తనకే అంటున్న అంబటి రాయుడు!

MI కెప్టెన్ రేస్.. నా మద్దతు తనకే అంటున్న అంబటి రాయుడు!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించి ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్సీపై భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబై జట్టుకు నాయకత్వం వహించడానికి సూర్యకుమార్ యాదవ్ సరైన ఎంపిక అని ఆయన స్పష్టం చేశారు. జట్టు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సూర్యకు పగ్గాలు అప్పగించడమే ఉత్తమమని రాయుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.రోహిత్ శర్మ కెప్టెన్సీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా అభిమానులు ఎంతో భావోద్వేగానికి గురవుతారని రాయుడు పేర్కొన్నారు. అయితే, జట్టు ప్రయోజనాల విషయంలో భావోద్వేగాలను పక్కన పెట్టి ప్రాక్టికల్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. రోహిత్ ఇప్పటికే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయాన్ని రాయుడు గుర్తు చేశారు. అంతేకాకుండా, రాబోయే రోజుల్లో వన్డే ప్రపంచకప్ కూడా జరగనున్న నేపథ్యంలో, రోహిత్‌పై అదనపు భారం లేకుండా చూడటం అవసరమని ఆయన విశ్లేషించారు.

మరోవైపు, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ సామర్థ్యాలను రాయుడు ప్రత్యేకంగా ప్రశంసించారు. సూర్య ఇప్పటికే కెప్టెన్‌గా ప్రపంచకప్‌ను గెలుచుకున్న అనుభవం కలిగి ఉన్నారని తెలిపారు. ఒత్తిడిని తట్టుకుని జట్టును ముందుండి నడిపించడంలో సూర్య తన ప్రతిభను నిరూపించుకున్నాడని ఆయన అన్నారు.ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణిస్తున్నాడని రాయుడు కొనియాడారు. ఒక యువ క్రికెటర్ తరహాలో ఎంతో ఉత్సాహంతో, దూకుడుగా ఆడుతూ ఫామ్‌లో ఉన్నాడని పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, ఐపీఎల్ 2027లో ముంబై ఇండియన్స్ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించడమే అత్యుత్తమ నిర్ణయమవుతుందని రాయుడు స్పష్టం చేశారు.

ఐపీఎల్ 2027కు SRH విధ్వంసకర బ్యాటర్ దూరం..!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు