Homeఆంధ్ర ప్రదేశ్మార్చిలోనే జగన్ పాదయాత్ర...!

మార్చిలోనే జగన్ పాదయాత్ర…!

  • మనసు మార్చుకున్న వైయస్సార్ కాంగ్రెస్ అధినేత

  • కేసులు, అరెస్టుల భయంతోనే..

  • ప్రజల మధ్య ఉంటే సానుభూతి వర్కౌట్

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : వైయస్ జగన్ పాదయాత్ర చేస్తారా? అయితే ఎప్పుడు చేస్తారు? వచ్చే ఏడాది ద్వితీయార్థంలో చేస్తారా? లేకుంటే మార్చిలో చేస్తారా? పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే ప్రచారం నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి తదుపరి కార్యాచరణ పై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. పార్టీని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ఆయన ఏదో పెద్ద మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని.. వచ్చే ఏడాది మార్చి నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారని వైసీపీ సానుభూతిపరులు, సోషల్ మీడియా హ్యాండర్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో నిరాశలో ఉన్న క్యాడర్లో ఉత్సాహం నింపడానికి.. ఆయన మళ్లీ పాదయాత్ర చేస్తారని సంకేతాలను పార్టీ శ్రేణులకు పంపుతున్నట్లు స్పష్టం అవుతుంది.

తెర వెనుక రాజకీయాలకి…

అయితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విషయంలో ఎప్పటికప్పుడు కొత్త ప్రచారం జరుగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రజల్లోకి వచ్చి పాదయాత్ర చేయడం కంటే.. తెర వెనుక రాజకీయాలు నడపడానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఈ విషయం వైసిపి ముఖ్య నేతలకు కూడా తెలుసు. గతంలో ప్రకటించిన పలు కార్యక్రమాలను వాయిదా వేసుకున్న తరహాలోనే.. పాదయాత్ర విషయంలోనూ కేవలం ప్రచారం మాత్రమే జరుగుతోందని.. ఆయన క్షేత్రస్థాయిలోకి దిగడం అనుమానమేనని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.

వ్యూహాత్మక కోణం…

తాజాగా మార్చిలో పాదయాత్ర అంటూ జరుగుతున్న ప్రచారం వెనుక ఒక వ్యూహాత్మక కోణం దాగి ఉందని చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో, కేంద్ర స్థాయిలో దర్యాప్తు సంస్థలు పలు కీలక కేసుల విచారణను వేగవంతం చేశాయి. వచ్చే మార్చినాటికి ఆ కేసుల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుని ఆయనకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ దర్యాప్తు సంస్థలు కట్టిన చర్యలకు ఉపక్రమిస్తే.. ప్రజా సమస్యలపై పాదయాత్రకు సిద్ధమవుతుంటే ప్రభుత్వం రాజకీయ కక్షతో అరెస్టు చేయించింది అనే సానుభూతి కోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకే నన్న అనుమానం వ్యక్తం అవుతుంది. అందుకే మార్చిలో పాదయాత్ర ప్రచారాన్ని తెరపైకి తెచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

ఉక్కిరి బిక్కిరి…

స్థానిక ఎన్నికల్లో వరుస పరాజయాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కనీసం ఉనికి చాటుకోలేకపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో కూడా దారుణ పరాజయం చవిచూసింది. అందుకే పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు.. ప్రజల్లో ఆదరణ తగ్గలేదని నిరూపించుకునేందుకు మార్చిలో పాదయాత్ర చేసి.. అరెస్టులు జరిగితే హైప్ క్రియేట్ చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలుగా.. విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇవి కూడ చ‌ద‌వండి:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు