Homeక్రైమ్పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య.. నలుగురిపై కేసు నమోదు

పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య.. నలుగురిపై కేసు నమోదు

క్రైమ్ మిర్రర్ : ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని చెరువుసింగారం గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెరువుసింగారం గ్రామానికి చెందిన చరప కవిత (20), అదే గ్రామానికి చెందిన చరణ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 16న తనను వివాహం చేసుకోవాలని కవిత చరణ్‌ను కోరినట్లు సమాచారం. అయితే పెళ్లికి అతడు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కవిత అదే రోజు సాయంత్రం పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది.

వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం కవిత మృతి చెందింది.

కుమార్తె మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై మృతురాలి తండ్రి రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు ఎస్ఐ మేడా ప్రసాద్ యువకుడు చరణ్‌తో పాటు అతని సోదరుడు, తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
also read : పొదుపు మంత్రమే మనదేశ బలం.. తినడం, తాగడం, తిరగడం కాదు : ప్రధాని మోదీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు