Homeఆంధ్ర ప్రదేశ్చరిత్ర చెరపలేని పేరు వైఎస్ఆర్: జయంతి సందర్భంగా వైసీపీ ఘన నివాళి

చరిత్ర చెరపలేని పేరు వైఎస్ఆర్: జయంతి సందర్భంగా వైసీపీ ఘన నివాళి

క్రైమ్ మిర్రర్,అమరావతి:- తెలుగు రాజకీయాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి (వైఎస్ఆర్) పేరు ఒక ప్రభంజనమని, ఆయన ఒక మహా నేత అని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కొనియాడింది. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైసీపీ విడుదల చేసిన ఒక ప్రత్యేక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.”కోట్లాది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహా నేత వైఎస్ఆర్” అని వైసీపీ ఆ వీడియోలో పేర్కొంది. 2003లో ఆయన చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్ర ప్రజల గుండెల్లో ఆయనకు శాశ్వత స్థానాన్ని కల్పించిందని పార్టీ గుర్తు చేసింది.ఆరోగ్య శ్రీ, ఉచిత కరెంట్, 108 అంబులెన్స్ సేవలు వంటి ఎన్నో ప్రజాకర్షక పథకాలతో లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపారని వైసీపీ నేతలు ఆయన సేవలను స్మరించుకున్నారు.ఈ వీడియో ప్రజల్లో విశేష స్పందనను రాబడుతోంది, వైఎస్ఆర్ పేరు వినగానే వారికి గుర్తోచ్చే జ్ఞాపకాలను పంచుకునేలా చేస్తోంది.

అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం

గ్లోబ‌ల్ హ‌బ్ గా మార‌నున్న హైద‌రాబాద్‌…! క్యూ క‌డుతున్న ఇంట‌ర్నేష‌నల్ వ‌ర్సిటీలు…

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు