Homeతెలంగాణహైదరాబాద్‌లో సంజయ్ దత్... క్యాన్సర్ రోగులకు ఆశాకిరణం...!

హైదరాబాద్‌లో సంజయ్ దత్… క్యాన్సర్ రోగులకు ఆశాకిరణం…!

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని సందర్శించి క్యాన్సర్ రోగులకు ఆత్మవిశ్వాసాన్ని నింపే సందేశం ఇచ్చారు. క్యాన్సర్‌ను చూసి భయపడకుండా, సరైన సమయంలో పరీక్షలు చేయించుకుని చికిత్స ప్రారంభిస్తే ఈ వ్యాధిని అధిగమించవచ్చని ఆయన పేర్కొన్నారు. తన జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకుంటూ రోగుల్లో ధైర్యాన్ని నింపేలా మాట్లాడారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉన్న ఆస్పత్రికి చేరుకున్న సంజయ్ దత్‌కు ఆస్పత్రి చైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు ట్రస్టు సభ్యులు నారా బ్రాహ్మణి, జేఎస్ఆర్ ప్రసాద్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు శాలువా కప్పి సత్కరించి, శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అందజేశారు.

Also Read:Radha Gayatri Death Case: రాధాగాయత్రి కేసులో షాకింగ్ టర్న్.. కలెక్టర్ కీలక నిర్ణయం!

ఆస్పత్రి ప్రాంగణంలో ఎన్టీఆర్, బసవతారకం దంపతుల విగ్రహాలకు నివాళులర్పించిన సంజయ్ దత్, అనంతరం పలు వార్డులను సందర్శించారు. ముఖ్యంగా చిన్నారుల విభాగానికి వెళ్లి పిల్లలతో మాట్లాడి, వారికి బహుమతులు అందజేశారు. అలాగే చికిత్స పొందుతున్న రోగులు, వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సంజయ్ దత్ మాట్లాడుతూ, తన కుటుంబాన్ని క్యాన్సర్ తీవ్రంగా ప్రభావితం చేసిందని గుర్తు చేసుకున్నారు. తన తల్లి క్యాన్సర్‌తో మృతిచెందారని, కొన్నేళ్ల క్రితం తాను కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడినట్లు వెల్లడించారు. అయితే వైద్యుల సూచనలు పాటిస్తూ చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్నానని చెప్పారు.

Also Read:తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు: కీలక ప్రకటన చేసిన DSP… ‘పాపను అప్పగిస్తే కేసు లేదు’

క్యాన్సర్ నిర్ధారణ అయిన వెంటనే నిరాశకు లోనవ్వకుండా, ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స ఫలితాలు మెరుగ్గా ఉంటాయని ఆయన వివరించారు. ప్రస్తుతం వైద్యరంగంలో ఎన్నో ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందని సూచించారు.మనోధైర్యం ఎంతో ముఖ్యమైన ఔషధం. క్యాన్సర్‌ను చూసి భయపడకండి. వైద్యులపై విశ్వాసం ఉంచి చికిత్స కొనసాగిస్తే ఈ వ్యాధిని జయించే అవకాశాలు చాలా ఉన్నాయి అంటూ రోగులకు సంజయ్ దత్ ప్రోత్సాహకరమైన సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి స్థాపన వెనుక ఉన్న సేవా లక్ష్యాన్ని వివరించారు. ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందించడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు