క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గోదావరి, కృష్ణా నదుల్లో పుష్కలంగా నీళ్లున్నా మోటార్లు ఆన్ చేయకపోవడం ‘క్రిమినల్ నెగ్లిజెన్స్’ అని ఆయన మండిపడ్డారు.ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. “వారికి ఉరి వేసినా తప్పులేదు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.దేవాదుల ప్రాజెక్టు మోటార్లను ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ‘గురుదక్షిణ’గా తెలంగాణ వాడుకోవాల్సిన నీళ్లను రేవంత్ రెడ్డి ఏపీకి వదులుతున్నారని ఆరోపించారు.తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర అనుమతులు ఉన్నట్లు నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.
రేవంత్, ఉత్తమ్‌కు ఉరి వేసినా తప్పులేదు: హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు!
By Vengal Reddy
0
127
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.
పాలిటిక్స్, టెక్నాలజీ, లైఫ్ స్టైల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
