Homeక్రైమ్ఇతర అబ్బాయిలతో మాట్లాడుతోందనే అనుమానం.. 16 ఏళ్ల బాలికను హత్య చేసిన యువకుడు!

ఇతర అబ్బాయిలతో మాట్లాడుతోందనే అనుమానం.. 16 ఏళ్ల బాలికను హత్య చేసిన యువకుడు!

తమిళనాడులో దారుణ హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇతర అబ్బాయిలతో మాట్లాడుతోందనే అనుమానంతో ఓ యువకుడు 16 ఏళ్ల బాలికను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తూత్తుకుడి జిల్లాలో శనివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. ముత్తురాజా అనే యువకుడు.. బాలిక ఇతర అబ్బాయిలతో మాట్లాడుతోందనే అనుమానంతో ఆమెపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. తొలుత గొంతు నులిమి, అనంతరం కత్తితో పొడిచి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

బాలికను హత్య చేసిన అనంతరం ముత్తురాజా కూడా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ ప్రయత్నంలో అతడు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

మృతిచెందిన బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూత్తుకుడి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకునేందుకు విచారణ కొనసాగిస్తున్నారు.

also read: అనుమానంతో దారుణం.. ప్రియురాలికి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మహిళ మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు