Homeతెలంగాణఆదిలాబాద్‌లో కలకలం.. ఆముదం గింజలు తిని ఆరుగురు చిన్నారులకు అస్వస్థత!

ఆదిలాబాద్‌లో కలకలం.. ఆముదం గింజలు తిని ఆరుగురు చిన్నారులకు అస్వస్థత!

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో చిన్నారులు ఆముదం గింజలు తిని అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. గాదిగూడ మండలం లోకారి గ్రామానికి చెందిన ఆరుగురు పిల్లలు ప్రమాదవశాత్తు ఆముదం గింజలు తినడంతో అనారోగ్యానికి గురయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. పెందూర్ అభిమన్ (6), సి. ఇందుబాయి (6), దుర్గాబాయి (4), ధనుష్ (5), జంగు (5), పల్లవి (3) అనే ఆరుగురు చిన్నారులు శుక్రవారం పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా మార్గమధ్యలో ఆముదం గింజలు తిన్నారు. అయితే ఆ సమయంలో ఎలాంటి ఇబ్బంది కనిపించకపోవడంతో పిల్లలు ఇంటికి చేరుకున్నారు.

శనివారం ఉదయం వారిలో కడుపునొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే చిన్నారులను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆరుగురు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది. చిన్నారులు తెలియని గింజలు, మొక్కల భాగాలను తినకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

also read: ‘రామాయణ’ సినిమాపై వీహెచ్‌పీ ఆగ్రహం.. రావణుడిని గొప్పగా చూపిస్తున్నారంటూ తీవ్ర అభ్యంతరం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు