Homeసినిమాట్రోలింగ్ పై రష్మిక మందన్న ఆగ్రహం .. కుటుంబ సభ్యుల జోలికొస్తే ఊరుకోనంటూ వార్నింగ్!

ట్రోలింగ్ పై రష్మిక మందన్న ఆగ్రహం .. కుటుంబ సభ్యుల జోలికొస్తే ఊరుకోనంటూ వార్నింగ్!

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై నటి రష్మిక మందన్న స్పందించారు. తనను ఉద్దేశించి చేసే విమర్శలను వ్యక్తిగతంగా తీసుకోనని, అయితే తన కుటుంబ సభ్యులు, స్నేహితులను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం అస్సలు సహించబోనని స్పష్టం చేశారు. ఇటీవల ‘మైసా’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఒక నటిగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకోవడంతో పాటు విమర్శలు ఎదుర్కోవడం కూడా వృత్తిలో భాగమేనని రష్మిక అభిప్రాయపడ్డారు. తన నటన, సినిమాలు, వ్యక్తిగత నిర్ణయాలపై ఎవరైనా అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చని, వాటిని స్వీకరించే మనస్తత్వం తనకు ఉందని చెప్పారు. విమర్శలను ఎదుర్కొంటూనే తాను మరింత దృఢంగా మారుతున్నానని వెల్లడించారు.

అయితే సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేని తన కుటుంబ సభ్యులు, స్నేహితులను సోషల్ మీడియాలోకి లాగి ట్రోల్ చేయడం మాత్రం సరైన పద్ధతి కాదని ఆమె అన్నారు. తనను విమర్శించడం వేరు.. తనకు సంబంధించిన వారిని ఇబ్బంది పెట్టడం వేరని పేర్కొన్నారు. అలాంటి చర్యలను మాత్రం ఎంతమాత్రం అంగీకరించబోనని స్పష్టం చేశారు.

మరోవైపు, సినిమా రంగంలో ఎదురయ్యే ఒత్తిడి, సోషల్ మీడియాలో వచ్చే ప్రతికూల వ్యాఖ్యల ప్రభావం నుంచి బయటపడేందుకు వ్యాయామం తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని రష్మిక తెలిపారు. వర్కవుట్స్ చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతున్నానని చెప్పారు.

also read: “మహేష్ బాబు సినిమాలో విలన్‌గా నటించేందుకైనా రెడీ”- అనుపమ పరమేశ్వరన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు