Homeక్రైమ్కారులో రహస్య అర.. రూ.3.83 కోట్ల బంగారం పట్టివేత.. హైదరాబాద్‌లో డీఆర్‌ఐ భారీ ఆపరేషన్!

కారులో రహస్య అర.. రూ.3.83 కోట్ల బంగారం పట్టివేత.. హైదరాబాద్‌లో డీఆర్‌ఐ భారీ ఆపరేషన్!

హైదరాబాద్‌లో భారీ స్థాయిలో సాగుతున్న బంగారం అక్రమ రవాణాను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు భగ్నం చేశారు. సాధారణ తనిఖీల్లో గుర్తించకుండా ఉండేందుకు కారులోనే ప్రత్యేకంగా రహస్య అరను ఏర్పాటు చేసి విదేశీ బంగారాన్ని తరలిస్తున్న స్మగ్లర్ల వ్యూహాన్ని అధికారులు ఛేదించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.3.83 కోట్ల విలువైన విదేశీ మూలాలున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

బంగారం అక్రమ రవాణా కోసం స్మగ్లర్లు అనుసరిస్తున్న కొత్త పద్ధతులు అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈసారి నిందితులు కారులోని టెయిల్ ల్యాంప్ వెనుక భాగాన్ని తమ అక్రమ రవాణాకు ఉపయోగించుకున్నారు. అక్కడ బయటకు కనిపించకుండా ప్రత్యేకంగా ఒక రహస్య అరను (క్యావిటీ) ఏర్పాటు చేసి, అందులో విదేశీ బంగారాన్ని దాచిపెట్టి తరలిస్తున్నట్లు గుర్తించారు.

ఈ వ్యవహారంపై ముందుగానే సమాచారం అందుకున్న డీఆర్‌ఐ అధికారులు హైదరాబాద్ పరిధిలో అనుమానిత కారును అడ్డగించారు. వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా టెయిల్ ల్యాంప్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన రహస్య అర అధికారులకు కనిపించింది. దానిని తెరిచి తనిఖీ చేయడంతో భారీ మొత్తంలో విదేశీ బంగారం బయటపడింది.

స్వాధీనం చేసుకున్న బంగారం విలువ అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం సుమారు రూ.3.83 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. బంగారంతో పాటు అక్రమ రవాణాకు ఉపయోగించిన కారును కూడా సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో ఎంతమంది ప్రమేయం ఉంది? బంగారం ఏ దేశం నుంచి వచ్చింది? హైదరాబాద్‌కు తీసుకొచ్చిన అనంతరం ఎక్కడికి తరలించాలనుకున్నారు? అనే కోణాల్లో డీఆర్‌ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

also read:  శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. రూ.1.37 కోట్ల విలువైన గోల్డ్ స్వాధీనం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు