ఇద్దరు ఆడపిల్లలు పుట్టారన్న కారణంతో భార్యను వేధించడమే కాకుండా, చివరకు ఫోన్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పిన ఘటన హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో వెలుగుచూసింది. కొడుకు కావాలన్న ఆశతో భార్యను మానసికంగా వేధించిన భర్త తీరుపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళ్తే.. సైదాబాద్‌కు చెందిన నిఖత్ అఫ్రీన్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే తమకు మగపిల్లాడు పుట్టలేదనే కారణంతో భర్త ఎండీ అలీ అర్షద్ ఆమెను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో గత నెల 24న తనకు థాయ్‌లాండ్‌లో ఉద్యోగం వచ్చిందని భార్యకు తెలిపిన అర్షద్.. తనపై ఉన్న కేసులను వెనక్కి తీసుకోవాలని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
అంతటితో ఆగకుండా మరుసటి రోజే ఫోన్ సందేశం ద్వారా భార్యకు ట్రిపుల్ తలాక్ ప్రకటించినట్లు తెలిపింది. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన నిఖత్ అఫ్రీన్ తన భర్త ఎండీ అలీ అర్షద్‌తో పాటు అత్త షహానా బేగం, ఆడపడుచు అర్షియాపై సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై దృష్టి సారించారు.
also read: కారులో రహస్య అర.. రూ.3.83 కోట్ల బంగారం పట్టివేత.. హైదరాబాద్‌లో డీఆర్‌ఐ భారీ ఆపరేషన్!
