ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ సభ్యులకు జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో కమెడియన్లు రైజింగ్ రాజు, దొరబాబుకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ నుంచి భీమవరం వైపు కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో కారులో ఉన్న జబర్దస్త్ టీమ్ సభ్యులు గాయపడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రైజింగ్ రాజు, దొరబాబుకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన తీరుతో స్థానికంగా ఆందోళన నెలకొంది.
అయితే ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, గాయపడిన వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
also read: ఆదిలాబాద్లో కలకలం.. ఆముదం గింజలు తిని ఆరుగురు చిన్నారులకు అస్వస్థత!
