Homeక్రైమ్గాంధీ ఆస్పత్రిలో ఏడు రోజుల పసికందు కిడ్నాప్.. ఆరుగురి అరెస్ట్

గాంధీ ఆస్పత్రిలో ఏడు రోజుల పసికందు కిడ్నాప్.. ఆరుగురి అరెస్ట్

క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందు అపహరణ ఘటన కలకలం రేపింది. అప్పుడే జన్మించిన ఏడు రోజుల ఆడ శిశువును ఓ ముఠా అపహరించి విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, కొన్ని గంటల్లోనే కేసును ఛేదించారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ఆరుగురిని అరెస్ట్ చేసి శిశువును గుర్తించినట్లు సమాచారం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన ఓ మహిళ వారం రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే ఆస్పత్రిలో ఉన్న సమయంలోనే కొందరు వ్యక్తులు ఆమెను సంప్రదించారు. ముగ్గురు ఆడపిల్లలు ఉంటే ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందని నమ్మిస్తూ మహిళను తమ మాటలతో ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. అనంతరం పసికందును తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

శిశువు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆస్పత్రి పరిసరాల్లోని వివరాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో కిడ్నాప్ వెనుక ఓ ముఠా ఉన్నట్లు గుర్తించారు.

విచారణలో పసికందును సుమారు రూ.లక్షకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పాల్గొన్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శిశువు అపహరణ వెనుక ఉన్న కారణాలు, కొనుగోలు చేసిన వ్యక్తుల వివరాలు, ముఠా కార్యకలాపాలపై పోలీసులు మరింత సమాచారం సేకరిస్తున్నారు. సికింద్రాబాద్ డీసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు సమన్వయంతో పనిచేసి తక్కువ సమయంలోనే కేసును ఛేదించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఆస్పత్రిలో పసికందు అపహరణ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించగా, చిన్నారుల భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది.
also read : ఖాళీ రైలు బోగీలో దారుణం.. మహిళపై లైంగిక దాడి చేసి హత్య!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు