Homeక్రైమ్విషాదం.. నూడుల్స్ తిన్న ఏడేళ్ల బాలిక మృతి! మరో బాలికకు అస్వస్థత

విషాదం.. నూడుల్స్ తిన్న ఏడేళ్ల బాలిక మృతి! మరో బాలికకు అస్వస్థత

రాజస్థాన్‌లోని జైపూర్‌లో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో తయారు చేసుకున్న నూడుల్స్ తిన్న ఇద్దరు చిన్నారుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో బాలిక అస్వస్థతకు గురైంది. ఏడేళ్ల పిహు కుమావత్‌ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. నవంబర్ 19న ఇంట్లో పెద్దలు ఎవరూ లేని సమయంలో పిహు, ఆమె అక్క దివ్యాంశి కలిసి నూడుల్స్ తయారు చేసుకున్నారు. ఇద్దరూ వాటిని తిన్న అనంతరం నిద్రపోయారు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన తల్లి.. పిల్లల పరిస్థితిని గమనించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది.

అయితే అప్పటికే పిహు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు అస్వస్థతకు గురైన దివ్యాంశికి చికిత్స అందించారు. ఆరోగ్యం మెరుగుపడటంతో ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నూడుల్స్ తిన్న తర్వాతే చిన్నారులు అస్వస్థతకు గురికావడంతో ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి నూడుల్స్ నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. పోస్టుమార్టం నివేదిక, ప్రయోగశాల పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే బాలిక మృతికి ఖచ్చితమైన కారణం వెల్లడయ్యే అవకాశం ఉంది.

also read: యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు జగన్ కోర్టును ఆశ్రయించారా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు