Homeతెలంగాణఆర్థిక చిక్కుల్లో బండ్ల గణేష్...!చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష‌...

ఆర్థిక చిక్కుల్లో బండ్ల గణేష్…!చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష‌…

  • రూ. 95 లక్షల భారీ జరిమానా

  • ఒంగోలు కోర్టు సంచలన తీర్పు

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆయనకు జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో నేరం రుజువు కావడంతో ఏడాది సాధారణ జైలు శిక్షతోపాటు 95 లక్షల రూపాయల భారీ జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. జరిమానా మొత్తం తో పాటు కేసు విచారణ నిమిత్తం బాధితుడికి అయిన కోర్టు ఖర్చులను కూడా బండ్ల గణేష్ భరించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ మేరకు ఒంగోలు న్యాయస్థానంలో విచారణ జరగగా.. న్యాయమూర్తి కీలక ఆదేశాలు ఇచ్చారు.

అసలేం జరిగిందంటే…?

ప్రకాశం జిల్లా మద్దిరాలపాడు గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి బండ్ల గణేష్ గతంలో 95 లక్షల రూపాయలు బాకీ పడ్డారు. ఆ బాకీ చెల్లించే క్రమంలో బండ్ల గణేష్ తన నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్స్ పేరిట 95 లక్షల రూపాయలకు ఒక చిక్కును అందజేశారు.. అయితే వెంకటేశ్వరరావు ఆ చెక్కును బ్యాంకులో వేయగా ఖాతాలో సరిపడా నగదు లేకపోవడంతో అది బౌన్స్ అయింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు ఒంగోలు కోర్టును ఆశ్రయించాడు. సుదీర్ఘ విచారణల అనంతరం న్యాయస్థానం బండ్ల గణేష్ను దోషిగా తేల్చింది.

గతంలో చాలాసార్లు…

వాస్తవానికి బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసుల్లో చిక్కుకోవడం, కోర్టుల నుంచి శిక్షలు ఎదుర్కొనడం ఇది మొదటిసారి కాదు. గతంలో టెంపర్ సినిమా నిర్మాణ సమయంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వంశీ అనే వ్యక్తికి ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. 2017లో హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు ఆయనను ఆరు నెలల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 15.86 లక్షల జరిమానా విధించింది. గతంలో శిక్షలు పడిన ప్రతిసారి వ్యక్తిగత పూచికత్తు పై బెయిల్ పొంది..పై కోర్టులో ఆపిల్ చేసుకుంటూ బండ్ల గణేష్ ఊరట పొందుతూ వచ్చారు. తాజాగా ఒంగోలు కోర్టులో వెలువరించిన ఈ తీర్పుపై కూడా ఆయన పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య.. నలుగురిపై కేసు నమోదు
  2. పొదుపు మంత్రమే మనదేశ బలం.. తినడం, తాగడం, తిరగడం కాదు : ప్రధాని మోదీ
  3.  2027 వన్డే ప్రపంచకప్.. దిగ్గజ ఆటగాళ్లపై బీసీసీఐ పూర్తి భరోసా
  4.  ప్రేమ వివాహానికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు