Homeతెలంగాణరూ.లక్ష కోట్ల మేఘా...! ఏకైక అధిపతిగా కృష్ణా రెడ్డి...

రూ.లక్ష కోట్ల మేఘా…! ఏకైక అధిపతిగా కృష్ణా రెడ్డి…

  • 1989లో రూ.5 లక్షల పెట్టుబడితో ప్రస్థానం

  • అనతి కాలంలోనే గణనీయమైన అభివృద్ధి

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: మేఘా కంపెనీలో కీలక మార్పు. లక్ష కోట్ల సంస్థకు అధిపతిగా కృష్ణారెడ్డి మారారు. దేశీయ మౌలిక సదుపాయాల రంగంలో దిగ్గజ సంస్థగా ఎదిగింది మేఘా. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ ఇంజనీరింగ్ అండ్ ఇంఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ యాజమాన్యంలో కీలక మార్పు చోటు చేసుకుంది. కుటుంబ ఒప్పందంలో భాగంగా కంపెనీ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పామిరెడ్డి పిచ్చిరెడ్డి వద్ద ఉన్న 43% వాటాను.. మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే సంస్థలో 57% వాటా కలిగి ఉన్న కృష్ణారెడ్డి.. ఈ తాజా కొనుగోలుతో మేఘా గ్రూప్ పై పూర్తి నియంత్రణ సాధించనున్నారు. ఈ భారీ లావాదేవీలకు అంతర్జాతీయ మధుపరులు.. ఆ సంస్థ విలువను లక్ష కోట్ల రూపాయలుగా అంచనాలు సంచలనంగా మారింది.

భారీగా నిధుల సమీకరణ…

తన మేనమామ పిచ్చిరెడ్డి వాటాను కొనుగోలు చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణ చేశారు కృష్ణారెడ్డి. ప్రపంచస్థాయి ఇంగ్లీష్ సిమెంట్ సంస్థల నుంచి 700 మిలియన్ డాలర్లు అంటే.. సుమారు 7000 కోట్ల రూపాయలు సమీకరించారు. అమెరికాకు చెందిన డేవిడ్సన్ క్యాంపర్న్ క్యాపిటల్ మేనేజ్మెంట్ నేతృత్వంలో, వర్డె పార్ట్నర్స్, హిల్ హౌస్ కాపిటల్ వంటి దిగ్గజ ప్రైవేట్ క్రెడిట్ సంస్థలు ఈ భారీ డీల్ లో భాగస్వాములయ్యారు. భారతీయ మౌలిక సదుపాయాల రంగంలో ప్రైవేటు క్రెడిట్ నిధులతో జరుగుతున్న అతిపెద్ద కార్పొరేషన్ లావాదేవీల్లో ఇది ఒకటి.

37 ఏళ్ల కిందట…

1989లో హైదరాబాద్లోని బాలానగర్లో పారిశ్రామిక వాడలో కేవలం 5 లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైంది మేఘా. ఒక చిన్న పైపుల తయారీ వర్క్ షాప్ గా పిచ్చిరెడ్డి ప్రారంభించిన ఈ సంస్థ.. తరువాత కృష్ణా రెడ్డి సారథ్యంలో అసాధారణ వృద్ధిని సాధించింది. నేడు సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, సొరంగాలు, విద్యుత్, హైడ్రో కార్బన్స్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, సిటీ గ్యాస్ వంటి బహుళ రంగాల్లో విస్తరించి 20 కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంపెనీకి చెందిన ఎనర్జీ ట్రాన్సిషన్ విభాగం విలువను కూడా సుమారు 14000 కోట్లుగా లెక్క కడుతున్నారు. అంతర్జాతీయ ప్రాజెక్టులు సైతం చేపట్టే వీలుగా మేఘా అవతరించింది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య.. నలుగురిపై కేసు నమోదు
  2. పొదుపు మంత్రమే మనదేశ బలం.. తినడం, తాగడం, తిరగడం కాదు : ప్రధాని మోదీ
  3.  2027 వన్డే ప్రపంచకప్.. దిగ్గజ ఆటగాళ్లపై బీసీసీఐ పూర్తి భరోసా
  4.  ప్రేమ వివాహానికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు