Homeఆంధ్ర ప్రదేశ్ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

క్రైమ మిర్రర్ : అతివేగం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రహదారి మధ్యలోని డివైడర్‌ను ఢీకొని బోల్తాపడటంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాద ఘటన బాపట్ల జిల్లా కారంచేడు మండలం కుంకలమర్రు సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు, చిలకలూరిపేట ప్రాంతాలకు చెందిన పది మంది కలిసి కారులో చీరాలకు సముద్ర స్నానం కోసం బయలుదేరారు. ఈ క్రమంలో కుంకలమర్రు సమీపానికి చేరుకోగానే కారు వేగం అదుపు తప్పింది. దీంతో రహదారి మధ్యలోని డివైడర్‌ను బలంగా ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతినడంతో అందులో ప్రయాణిస్తున్న వారు గాయాలపాలయ్యారు.

ప్రమాద తీవ్రతకు గుంటూరుకు చెందిన పల్లపు లక్ష్మయ్య (65), చిలకలూరిపేటకు చెందిన గుంజి నాగేంద్రం (55) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరోవైపు తీవ్ర గాయాలైన నాలుగేళ్ల చిన్నారి అశ్వినిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ చిన్నారి ప్రాణాలు నిలవలేదు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.

కారులో ఉన్న మిగిలిన ప్రయాణికులు కూడా గాయపడటంతో వారిని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంతో బాధిత కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. చీరాల డీఎస్పీ మహమ్మద్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, కారు వేగం తదితర అంశాలపై విచారణ కొనసాగిస్తున్నారు.
also read : హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. నాలుగు ప్రముఖ హోటళ్ల లైసెన్సులు రద్దు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు