Homeసినిమానవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’.. ప్రత్యేకంగా వీక్షించిన భట్టి విక్రమార్క!

నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’.. ప్రత్యేకంగా వీక్షించిన భట్టి విక్రమార్క!

భారతదేశ సామాజిక చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహనీయులు జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే. కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడటంతో పాటు మహిళలకు విద్య అందించేందుకు వారు చేసిన కృషి ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ మహనీయుల జీవిత ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లు, సమాజ మార్పు కోసం సాగించిన పోరాటాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తూ రూపొందిన చిత్రం ‘ఫూలే’.

ప్రముఖ దర్శకుడు అనంత్ మహదేవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, డా. పొన్నం రవిచంద్ర నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. కుల వివక్షను ఎదిరిస్తూ సమానత్వం కోసం ఫూలే దంపతులు సాగించిన ఉద్యమం, మహిళా విద్యకు వారు చేసిన సేవలను ఈ సినిమా ప్రధానంగా చూపించనుంది. ఆనాటి సామాజిక పరిస్థితులు, మార్పు కోసం వారు చేసిన త్యాగాలను ప్రేక్షకులకు పరిచయం చేయనుంది.

ఇప్పటికే చిత్రీకరణతో పాటు అన్ని నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు. ఫూలే దంపతుల జీవిత విశేషాలు, వారి సామాజిక సేవలను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో చిత్రబృందం ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.

విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఫూలే దంపతులు చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, వారి ఆశయాలను నేటి సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చిత్రబృందం పేర్కొంది. మరి ఈ చారిత్రక నేపథ్యంతో రూపొందిన ‘ఫూలే’ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

also read: ఇతర అబ్బాయిలతో మాట్లాడుతోందనే అనుమానం.. 16 ఏళ్ల బాలికను హత్య చేసిన యువకుడు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు