క్రైమ్ మిర్రర్,అమరావతి:- తన వీరాభిమాని, చిన్నారి నిరంజన్ మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిరంజన్ ఇక లేడనే వార్త తన హృదయాన్ని కలచివేసిందని ఆయన ఆవేదన చెందారు.ఇటీవల నిరంజన్ను కలిసిన క్షణాలను పవన్ కల్యాణ్ గుర్తుచేసుకున్నారు. “ఆ క్షణాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన చిరునవ్వు ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి,” అని పవన్ భావోద్వేగానికి గురయ్యారు.నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తన సంతాపం తెలియజేశారు.
పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత YSR- బండి రమేష్
నితిన్ నబిన్ పర్యటనతో తెలంగాణ బీజేపీ నేతల్లో జోష్…!