Homeక్రైమ్రక్తపు మడుగులో యువకుడు, అసలు ఏం జరిగిందంటే...!

రక్తపు మడుగులో యువకుడు, అసలు ఏం జరిగిందంటే…!

Crime Mirror,Latest Updates: కర్ణాటకలోని చిక్కబల్లాపురం నగర శివారులలోని ప్రసిద్ధి చెందిన నంది హిల్స్ సమీపంలోని ఒక హోం స్టేలో దారుణం చోటుచేసుకుంది. ఈ హోం స్టేకు వెళ్లిన ప్రేమికులలో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, యువకుడు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళకు చెందిన సాయి సురభి (23), కేరళలోని కోజికోడ్ కు చెందిన సంజిత్ అలీ (24) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ కొద్దిరోజుల కిందట చిక్కబల్లాపురం నగర శివారులలోని ఒక హోం స్టేకు వెళ్లారు. వీరిద్దరూ శనివారం హోమ్ టేకు వెళ్ళగా సోమవారం రూమ్ ఖాళీ చేస్తామని నిర్వాహకులకు చెప్పారు.

అయితే టైం దాటినప్పటికీ ఖాళీ చేయకపోవడంతో సిబ్బంది లోపలకు వెళ్లి చూడగా యువతి చనిపోయి కనిపించింది. అలాగే యువకుడు కూడా అపస్మార్క స్థితిలో ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే సిబ్బంది పోలీసులకు తెలియజేశారు. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ కుశాల్ చౌక్సీ, నందగిరి ధామ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

యువతి ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. అయితే కొన్ని మాత్రలు కూడా రూమ్లో కనిపించినట్లు పోలీసులు చెబుతున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న సంజీత్ ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన విషయాలను పరిశీలించిన పోలీసులు సురభిని హత్య చేసి తరువాత సంజీత్ ఆత్మహత్యాయత్నం చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉండవచ్చని, ఈ క్రమంలోనే యువకుడు యువతని హత్య చేసి తరువాత తాను ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • లవ్ జిహాద్ హత్యగా ఆరోపిస్తున్న తల్లిదండ్రులు..

యువతి మృతి చెందింది అన్న విషయం తెలుసుకున్న సురభి తల్లిదండ్రులు బోరుణ వినిపిస్తున్నారు. సురభి తల్లి గీత ఘటనా స్థలానికి చేరుకొని కూతురిని పట్టుకుని విలపించింది. ఇదొక లవ్ జిహాద్ అచ్చుగా ఆమె ఆరోపించింది. బెంగుళూరు దయానంద సాగర్ కాలేజీలో చదువుతున్న సమయంలో సంజీత అలీ పరిచయం అయ్యాడని, అప్పటి నుంచే ప్రేమ పేరిట వేధించేవాడని గీత వెల్లడించింది.

అతడు నుంచి తన కుమార్తెను కాపాడుకునేందుకు వేరే చోట ఉంచి చదివిస్తున్నట్లు వెల్లడించింది. తన కుమార్తెను అతడు పూర్తిగా నాశనం చేశాడని, డ్రగ్స్ కు అలవాటు చేశాడని వాపోయింది. తాను కష్టపడి రెండు మూడు చోట్ల ఆమెకు చికిత్స చేయించి బాగు చేసుకున్నట్లు వెల్లడించింది. ముద్దేనా హళ్లిలోనీ ఒక సెంటర్లో ఫిజియోథెరపిస్టుగా సురభి చేరిందని, శనివారం సత్సంగం ఉందని చెప్పి వెళ్లిందని వాపోయింది.

ఈ సంజిత్ ఆమెను నమ్మించి హోం స్టేకు తీసుకెళ్లి హత్య చేశాడని ఆరోపించింది. యువతి మేనమామ శంకర్ నారాయణ పోలీసులపై తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సంజిత్ అలీ వేధింపులపై గతంలో తామ ఫిర్యాదు చేశామని, పోలీసులు పట్టించుకోకపోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడని వ్యాఖ్యానించారు. మరోవైపు గ తేడాది సురభి మిస్సింగ్ పై బాణాశంకరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.

అప్పుడు స్నేహితురాలు ఇంట్లో సురభిని గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. ఏడాది తిరిగేసరికి సురభి మృత్యువాత చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హోమ్ స్టే నిర్వహకులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వాళ్లు ఎప్పుడు వచ్చారు, వచ్చిన తర్వాత నుంచి వారి ప్రవర్తన ఎలా ఉంది ఇటువంటి విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు