Homeఆంధ్ర ప్రదేశ్శ్రీకాకుళంలో దారుణం... ఇద్దరు బిడ్డల గొంతు కోసిన తల్లి

శ్రీకాకుళంలో దారుణం… ఇద్దరు బిడ్డల గొంతు కోసిన తల్లి

Crime Mirror,AP State News: శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్నబిడ్డల గొంతు కోసి తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన ఆమదాలవలస మండలం వెదుళ్లవలసలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న వివరాల ప్రకారం. గ్రామాలకు చెందిన వరలక్ష్మి అనే మహిళ మూడేళ్ల కుమార్తె, నాలుగు నెలల పసి కందును దారుణంగా హత్య చేసింది.

ఆ తరువాత వరలక్ష్మి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో జరిగిన ఈ ఘటన చుట్టుపక్కల వారికి తెలియడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. స్థితిలో ఉన్న వరలక్ష్మిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. చిన్నారులం గొంతు నులిమి అత్యంత కిరాతకంగా చంపేసింది. ఈ ఘటనలో భవాని (3 ఏళ్లు), చాందిని (4 నెలలు)గా గుర్తించారు. పసి కందులు అని కూడా చూడకుండా కన్నతల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడటం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

  • కుటుంబ కలహాలే కారణమని ప్రాథమిక అంచనా..!

కన్న తల్లే కాల యమురాలిగా మారి తన ఇద్దరు పసి పిల్లల గొంతుకోసి కిరాతకంగా హత మార్చింది. అనంతరం తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఆమదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామానికి చెందిన వరలక్ష్మి అనే వివాహిత ఈ దారుణానికి ఒడిగట్టింది. దీనికి కుటుంబంలో మనస్పర్ధలే కారణంగా చెబుతున్నాను.

వరలక్ష్మి భర్త రమణ ఉపాధి నిమిత్తం తెలంగాణ రాష్ట్రం నల్గొండలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్ధలు, కుటుంబ కలహాలతో కొద్దిరోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ గొడవల వల్ల తీవ్ర మనస్థాపానికి గురైన వరలక్ష్మి ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని ప్రాథమికంగా పోలీసులు, స్థానికులు గుర్తించినట్లు తెలుస్తోంది.

పిల్లలిద్దరినీ హత మార్చిన తర్వాత తన గొంతు కోసుకున్న తల్లి వరలక్ష్మి ప్రస్తుతం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, మెరుగైన వైద్యం కోసం ఆమెను శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు