HomeతెలంగాణTG20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ: నేడే ట్యాంక్‌బండ్‌పై ట్రోఫీ ఆవిష్కరణ!

TG20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ: నేడే ట్యాంక్‌బండ్‌పై ట్రోఫీ ఆవిష్కరణ!

క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- తెలంగాణలో క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు సిద్ధమవుతున్న ప్రతిష్టాత్మక ‘TG20’ లీగ్‌కు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సరికొత్త క్రికెట్ టోర్నమెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని లీగ్ నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. ఈ నెల 21 నుంచి ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ప్రారంభం కానుంది. ఈ సారి టోర్నీ ప్రారంభానికి ముందే సందడి మొదలుకానుంది. ఈ రోజు (బుధవారం) హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ట్యాంక్‌బండ్‌పై TG20 ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు పలువురు క్రీడా, సినీ రంగ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. లీగ్ దశ నుంచి ఫైనల్స్ వరకు అత్యంత ఉత్కంఠభరితంగా మ్యాచ్‌లు సాగనున్నాయి. ఇక జూలై 11న హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గ్రాండ్‌గా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఈ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు రూ. 1 కోటి నగదు బహుమతి లభించనుంది.రన్నరప్‌గా నిలిచిన రన్నరప్ జట్టుకు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ అందజేయనున్నారు.యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ ఈ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారడంతో, TG20 టోర్నమెంట్‌కు మరింత భారీ ఆధరణ లభిస్తుందని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

హోంమంత్రి అనితపై ‘మేకప్’ వ్యాఖ్యలు: తీవ్రంగా స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

‘బండి’ని ప్రోత్సహిస్తేనే బిజెపికి భవిత…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు