మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ చిత్రం నుంచి మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే ఒక పాటతో మంచి స్పందన తెచ్చుకున్న ఈ మూవీ, ఇప్పుడు రెండో సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘యాలో యాలో’ అనే పేరుతో ఉన్న ఈ పాటను ఆగస్టు 3న ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సాంగ్ పూర్తి స్థాయిలో కుటుంబ భావోద్వేగాలను ప్రతిబింబించేలా ఉంటుందని సమాచారం.
ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌లో రవితేజ తన కుటుంబంతో కలిసి కనిపిస్తూ, సినిమాలోని ఫ్యామిలీ ఎమోషన్స్‌ను హైలైట్ చేశారు. ముఖ్యంగా ప్రియా భవాని శంకర్ పాత్ర కూడా ఈ సాంగ్‌లో కీలకంగా కనిపించనుంది.
ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. కుటుంబ కథా నేపథ్యంతో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే విడుదలైన ‘ఇరుముడి కట్టు’ అనే అయ్యప్ప భక్తి గీతం సోషల్ మీడియాలో మంచి స్పందన అందుకుంది. అదే ఊపులో ఇప్పుడు ‘యాలో యాలో’ సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం ఆశిస్తోంది.
ఇక సినిమా విడుదల విషయానికి వస్తే, ముందుగా ప్రకటించినట్టుగానే ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు యూనిట్ మరోసారి స్పష్టం చేసింది. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశముంది.
also read: ప్రాంతీయతకు అతీతంగా తెలుగు సంస్కృతిని గౌరవించాలి: ‘ఇడుపుకాయితం’ వివాదంపై నరేశ్ స్పందన
