Homeఅంతర్జాతీయం"నన్ను చంపొచ్చు... అయినా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా".. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు!

“నన్ను చంపొచ్చు… అయినా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా”.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు!

క్రైమ్ మిర్రర్,అంతర్జాతీయం:- బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ, తన ప్రజల కోసం తాను బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తన దేశం పట్ల, ప్రజల పట్ల ఉన్న అంకితభావాన్ని చాటుకున్నారు.”నాపై ఎన్ని కేసులు పెట్టినా అవి నన్ను ఆపలేవు. నన్ను జైల్లో వేయవచ్చు లేదా నన్ను చంపవచ్చు. కానీ, నేను మాత్రం నా దేశానికి తిరిగి వెళ్తాను,” అని ఆమె ఉద్వేగభరితంగా అన్నారు. తాను తిరిగి వెళ్లడానికి కారణం అధికారం కోసం కాదని, బంగ్లాదేశ్‌లో శాంతి, అభివృద్ధి, మరియు ప్రజల భద్రత కోసమేనని ఆమె స్పష్టం చేశారు. “నా దేశాన్ని మళ్లీ సరైన మార్గంలో పెడతాను. నా ప్రజల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది,” అని హసీనా ధీమా వ్యక్తం చేశారు.తన ప్రసంగంలో భాగంగా, ఆమె తన కుటుంబం గురించి, దేశంలో జరిగిన అల్లర్ల గురించి తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఈవెంట్‌లో ఆమె చేసిన ప్రసంగం తాలూకు ఆడియో రికార్డింగ్‌ను మీడియాకు కూడా పంచుకున్నారు. దేశం విడిచి వెళ్లిన తర్వాత ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బంగ్లాదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆమె రాకతో దేశంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అమెరికా రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. తెలంగాణ విద్యార్థుల వీసాలపై కీలక విజ్ఞప్తి

హైదరాబాద్‌లో నకిలీ ఎన్‌ఓసీల స్కాం- హైడ్రా రంగనాథ్ తో పాటు ఫైర్ డీజీ సంతకాలు ఫోర్జరీ

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు