Homeజాతీయంపూంచ్‌లో ల్యాండ్‌మైన్ పేలుడు.. ఇద్దరు ఆర్మీ జవాన్లకు తీవ్ర గాయాలు

పూంచ్‌లో ల్యాండ్‌మైన్ పేలుడు.. ఇద్దరు ఆర్మీ జవాన్లకు తీవ్ర గాయాలు

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ల్యాండ్‌మైన్ నిర్వీర్య చర్యల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. మేంథర్ సెక్టార్‌లోని కంగా గలీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది ల్యాండ్‌మైన్‌ను తొలగించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది.

ఈ ఘటనలో ఇద్దరు ఆర్మీ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భూమిలో అమర్చిన కొన్ని ల్యాండ్‌మైన్‌లు తమ అసలు స్థానాల నుంచి కదిలే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.

మరోవైపు పూంచ్‌తో పాటు సోపోర్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టి మరికొన్ని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

also read: ఆస్పత్రిలోనే ప్రమాదం.. మహిళపై కూలిన స్లాబ్‌.. రాజస్థాన్ లో ఘటన

తాజావార్తలు