Homeక్రైమ్కారు రూపంలో వచ్చిన కాలయముడు.. మూడేళ్ల బాలుడు అక్కడికక్కడే దుర్మరణం!

కారు రూపంలో వచ్చిన కాలయముడు.. మూడేళ్ల బాలుడు అక్కడికక్కడే దుర్మరణం!

క్రైమ్ మిర్రర్ : నగరంలో వేగంగా దూసుకొచ్చిన ఒక కారు తీవ్ర విషాదాన్ని నింపింది. రోడ్డుపై వెళ్తున్న మూడేళ్ల చిన్నారిని కారు బలంగా ఢీకొట్టడంతో ఆ బాలుడు మృతి చెందాడు. ఈ ఘోర ప్రమాదం హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొహియుద్దీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక స్వీకార్ హోటల్‌కు ఫుడ్ పార్సెల్ తీసుకోవడానికి వెళ్లారు. అదే సమయంలో సమీపంలో ఉన్న చిన్నారి ఇజ్హాన్ ఉద్దీన్ (3) వద్దకు ఒక్కసారిగా అతివేగంతో వచ్చిన కారు దూసుకొచ్చి ఢీకొట్టింది.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు.ఈ ఘటన సమాచారం అందుకున్న యాకుత్‌పుర శాసనసభ్యుడు (ఎమ్మెల్యే) జాఫర్ హుస్సేన్ మెరాజ్ ప్రమాద స్థలాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పోలీస్ అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ప్రమాదానికి కారణమైన కారును, డ్రైవర్‌ను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
also read:మోసం కేసులో ‘మహాభారత్’ భీముడు అరెస్ట్.. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు